చత్రపతి శివాజీ 394వ జయంతి రెడ్డిపల్లి గ్రామంలో యువకులు ఘనంగా నిర్వహించారు

చత్రపతి శివాజీ 394వ జయంతి రెడ్డిపల్లి గ్రామంలో యువకులు ఘనంగా నిర్వహించారు

ప్రజా గొంతుక న్యూస్

గండీడ్ ఫిబ్రవరి 19

మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం

భారత జాతి సగర్వంగా చెప్పుకునే ధీరుడు.. యావత్ భారతం వీరత్వానికి ప్రతీకగా కొలుచుకునే చత్రపతి శివాజీ 394 వ జయంతి వేడుకలు రెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తులు మాట్లాడుతూ నేడు. మరాఠా రాజ్య స్థాపకుడు శివాజీ గొప్ప యోధుడు. అలాంటి యోధుడి జన్మధినాన్ని భారత్‏లో వేడుకగా జరుపుకుంటుంటారు. మరీ ముఖ్యంగా మహారాష్ట్రలో పండగలాగా జరుపుకుంటారు. మాస్టర్ స్ట్రాటజిస్ట్‏గా పేరుగాంచిన ఛత్రపతి శివాజీ మొఘలులపై అనేక యుద్ధాలు చేసి మరాఠా సామ్రాజ్యాన్ని రూపొందిచాడు. 1674లో శివాజీకి చక్రవర్తీగా పట్టాభిషకం జరిగింది. అలాంటి గొప్ప వీరయోధుడి 394వ జయంతి నేడు.
శివాజీ 1630 ఫిబ్రవరి 19 వైశాఖ శుక్ల పక్షం తదియ నాడు పుణె జిల్లాలోని జున్నార్‌ పట్టణం దగ్గర శివనేరి కోటలో షాహాజీ, జిజియాబాయి దంపతులకు జన్మించారు. శివాజీకి బాల్యంలో మాతృభూమిపై, ప్రజలపైన ప్రేమ కలిగే విధంగా తల్లి విద్యాబుద్ధులు నేర్పింది. భారత, రామాయణ గాథలు చెప్పి వీరత్వం చిగురింప చేసింది. వీరు మహారాష్ట్రలో వ్యవసాయం చేసుకునే భోస్లే కులానికి చెందినవారు. శివాజీ తల్లి జిజియాబాయి దేవగిరి మరాఠా యాదవ రాజుల వంశానికి చెందిన ఆడ పడుచు.
ఓటమి తప్పనిపిస్తే, యుద్ధం నుండి తప్పుకోవాలి. అనుకూల సమయాన్ని చూసి దాడి చేసి గెలవాలి. ఈ సూత్రాన్ని శివాజీ ఎక్కువగా నమ్మేవారట. ఇదే శివాజీ పాటించే యుద్ధతంత్రం. పటిష్ఠమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి రాజ్యాన్ని కాపాడుకోటానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది.
1674 జూన్‌ 6న రాయగఢ్‌ కోటలో వేద పఠనాల మధ్య శివాజీని క్షత్రియ రాజులందరికీ అధిపతిగా కీర్తిస్తూ ’ఛత్రపతి ’ అని బిరుదును ప్రదానం చేసారు. కొన్నాళ్ళకు శివాజీ 50వేల బలగంతో దక్షిణ రాష్ర్టాల దండయాత్రచేసి వెల్లూరు, గింగీలను సొంతం చేసుకున్నారు. 27 ఏండ్లపాటు యుద్ధాలలో గడిపి సువిశాల మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పారు. నిరంతరంగా యుద్ధాలు చేస్తున్న సమయంలో మూడు వారాలు తీవ్ర జ్వరంతో బాధపడి 1680 ఏప్రిల్‌ 3న రాయగఢ్‌ కోటలో మరణించారు. ఈ కార్యక్రమంలో. గ్రామ యువకులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *