ఢిల్లీలో రాహుల్ గాంధీ మర్యాదపూర్వకంగా కలిసిన యువ నేత తుమ్మల యుగంధర్
ఖమ్మం జిల్లా పార్లమెంట్ టికెట్టు నాకే కేటాయించాలి?
ప్రజా గొంతుక :రంగా రెడ్డి జిల్లా బ్యూరో
మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారి తనయుడు యువ నేత తుమ్మల యుగంధర్ సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ గారిని మర్యాదపూర్వకంగా కలిశారని మంగీలాల్ చోహన్ తెలియజేశారు పార్లమెంట్ టికెట్ తనకే కేటాయించాలని యావత్ ఖమ్మం జిల్లా ప్రజలు యువకులు బాగా ఒత్తిడి చేస్తున్నారని కావున ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ టికెట్టు తనకు కేటాయించి ప్రజలకు యువకులకు మరింత సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరగా దానికి రాహుల్ గాంధీ గారు సానుకూలంగా స్పందించినట్లు తెలిసినది యుగంధర్ అన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు చౌహాన్ మరియు పోలూరి రమేష్ సూర్య కుమార్ ల ద్వారా తెలుసుకొని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నారు దళిత గిరిజన వాడలలో కలియ తిరుగుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అందరికీ అందుబాటులో ఉంటున్నారని చోహన్ తెలియజేశారు కావున దళిత గిరిజన యువతి యువకులకు మరియు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు మేలు జరగాలంటే యువనేత ఆపద్బాంధవుడు అయిన తుమ్మల యుగంధర్ అన్నకి ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్లమెంట్ టికెట్ కేటాయించాలని తెలియజేయడం జరిగినది