చర్ల పాత్రికేయులకు తేనేటి విందు1
ప్రజా గొంతుక న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా/ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాచర్ల మండలం కేంద్రంలోగల గురుదేవ్ విద్యాలయ యాజమాన్యం, విద్యాలయములో చర్ల మండల పరి ధిలోని పాత్రికేయులకు మంగ ళవారం అల్పాహార విందును ఏర్పాటు చేసి పాత్రికేయులతో ఆత్మీయ అనుబంధం ఏర్పరచుకున్నారు. ఈ సందర్భంగా గురుదేవ్ విద్యాలయ ప్రిన్సిపాల్ గిరి ప్రసాద్ మాట్లాడుతూ నేను చర్ల మండల కేంద్రంలోనే విద్యను అభ్య సించానని ఉన్నత చదువులు పట్టణ ప్రాంతా ల్లో పూర్తి చేశాను. చర్ల మండల ప్రాంత ప్రజలకు మంచి విద్యను అందించాలనే ఆలోచనతో నేను విద్య నేర్చుకున్న నా గురువు ల ప్రోత్సాహం తో గురుదేవ్ విద్యాలయాన్ని ప్రారం భించానన్నారు. గురుదేవ్ విద్యా లయంలో విద్యను అభ్యసించే విద్యార్థిని,విద్యార్థులకు విద్యతో పాటుగా మంచి క్రమశిక్షణ,ప్రతి రోజు క్లాసులతో పాటు ఒక క్లాసును సాంస్కృతిక కూచిపూడి భరతనాట్యం, కోలాటం, జానపద నృత్యం, కరాటే, వ్యాయామంతో పాటు విద్యార్థులు ఇష్ట పడే అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్ర మాలకు సంబంధించిన శిక్షణ ను ఇచ్చి ప్రోత్సహిస్తూ విద్యార్థులలో దాగివున్న కళలను వెలికితీస్తు ప్రోత్సహిస్తున్నామ ని తెలుపుతూ పాత్రికే యులతో ఆత్మీ య అనుబంధాన్ని పంచుకుని విద్యాలయం లో అమలు పరుస్తున్నా కార్యచరణ ప్రణాళిక వివరాలను తెలిపారు.