మండల అధ్యక్ష పదవి అధిష్టానం నిర్ణయం
కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలకు చోటు ఇవ్వకూడదు
కాంగ్రెస్ సీనియర్ నాయకులు జిల్లెల్ల దయాకర్ రెడ్డి
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మురి ప్రతాపరెడ్డి ఆదేశాల మేరకు మండల పలు గ్రామాలలో గ్రామ శాఖ అధ్యక్షులను గ్రామ కమిటీలను ఎన్నుకోవడం జరిగిందని అన్నారు. అలాగే మండల అధ్యక్షుడుని పార్టీ అధిష్టానం జనగామ డిసిసి అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాపరెడ్డి నిర్ణయం మేరకు మండల అధ్యక్షుని నియామకం జరుగుతుందని తెలిపారు.పార్టీలో గ్రూప్ రాజకీయాలు చేయకూడదని, ఎవరు కూడా పార్టీ యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించి మాట్లాడకూడదని అన్నారు. త్వరలో మండల అధ్యక్ష నియామకం ఉంటుంది తెలియజేశారు. కార్యకర్తలు నాయకులు కలిసికట్టుగా పనిచేసే పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.