నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
ప్రజా గొంతుక /బచ్చన్నపేట మండలం
గ్రామాల అభివృద్ధియే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని పోచన్నపేట కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు అకిరెడ్డి శ్రీధర్ అన్నారు .నూతన సిసి రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మండల ఇన్చార్జ్ నూకల బాల్రెడ్డి చొరవతో పోచన్నపేట గ్రామంలో అభివృద్ధి పనులలో భాగంగా సిసి రోడ్ నిర్మాణ పనులను ప్రారంభించడం జరిగిందని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గ్రామస్థాయి నుండి అభివృద్ధి జరుగుతుందని తెలియజేశారు. కొమ్మూరి ప్రతాపరెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల మహేందర్, ఉత్సవ కమిటీ డైరెక్టర్ శివరాములు, బాలస్వామి ,ఎల్లేష్, ఉపేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.