ప్రతాపన్నకే.. ఎందుకిలా..?

ప్రతాపన్నకే.. ఎందుకిలా..?

“కార్పొరేషన్” ఆశలు గల్లంతు

తెలంగాణలో 37 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

చోటుదక్కని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి

పార్టీలో చేరిన అరగంటలోనే కొందరికి క్యాబినెట్ హోదా..

పార్టీ పట్టిష్టతకు, విజయానికి పనిచేసిన నాయకుల పరిస్థితి ఘోరం..?

షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి అవకాశం ఏది..?

వలస నాయకులకున్న ప్రాధాన్యత కష్టపడ్డ వారికి ఉంటుందా లేదా..?

ప్రజా గొంతుక:రంగా రెడ్డి జిల్లా బ్యూరో

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీ విజయం కోసం ప్రభుత్వం పకడ్బందీ ప్లాన్ వేసింది. టికెట్ ఆశిస్తున్న పలువురికి అసంతృప్తి కలగకుండా నామినేటెడ్ పదవులు కట్టబెట్టింది. అంతేకాదు గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యేల గెలుపుకు తీవ్రంగా కృషి చేసిన వారిని కూడా దృష్టిలో పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల షెడ్యూలు రావడంతో కోడ్ చిక్కుల్లేకుండా వ్యూహాత్మకంగా వ్యహరించింది. దాదాపు 37 మందికిపైగానే ఈ జాబితాలో పేర్కొంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ కార్పొరేషన్లతో పాటు కొత్తగా ఏర్పాటైనవాటిలో కూడా భర్తీ చేసింది. కాగా, ఎలక్షన్ కోడ్ ఉల్లంఘనల ఆరోపణలు రాకుండా ఈ నెల 14వ తేదీనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు రాని ఆశావహులతో పాటు ప్రస్తుతం లోక్‌సభ రేసులో ఇబ్బంది రాకుండా ఉండేలా లీడర్ల ఎంపిక జరిగింది. పార్టీలో చురుగ్గా పనిచేసినవారిని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గుర్తించి వారికి ఈ పదవులను కట్టబెట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా పార్టీలో చేరిన అరగంటలోనే కొందరికి క్యాబినెట్ హోదా పోస్టులు కల్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పార్టీకి ఎంతో నమ్మకంతో పనిచేసి కీలకమైన దశలో అండగా నిలబడిన నాయకులకు పోస్టులు ఏమని కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకుల స్వయంగా చర్చించుకుంటున్నారు. ఎవరి వ్యూహం వారిది కాదనలేం కానీ సౌమ్యులకు అజాతశత్రువులకు ముందు వరుసలో గుర్తించకపోవడమే పెద్ద మైనస్ పాయింట్ గా చెప్పవచ్చు. రాష్ట్రంలో అద్దంకి దయాకర్ లాంటి వారి పేరు ఇలాంటి సందర్భాల్లో ప్రత్యేకంగా జనాలు ప్రస్తావిస్తున్నారు. అంతేకాదు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి పేరు కూడా దీనికి ఉదహరిస్తున్నారు. ఇంకా ఎన్నికల్లో కీలకంగా పని చేసిన ఉమ్మడి జిల్లా నాయకుల్లో చాలా మంది పేర్లు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. దాదాపు కార్పొరేషన్ల చైర్మన్ ల నియామకం లోక్ సభకు ముందే పూర్తి చేశారు. ఏవో ఇంకొన్ని కార్పొరేషన్లు మాత్రమే నవమాత్రంగా మిగిలి ఉన్నాయి. ప్రధానమైన కార్పొరేషన్ల కు చైర్మన్ లను సీఎం రేవంత్ రెడ్డి నియమించారు.

ఆయనకే ఎందుకిలా..?

పార్టీలో చేరిన అరగంటలోపే పాలమూరు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి జాక్ పాట్ కొట్టారు. వాస్తవానికి మహబూబ్నగర్ పార్లమెంట్ పరిధిలో మాజీ ఎమ్మెల్యే చెవులపల్లి ప్రతాప్ రెడ్డి ఎన్నికలకు ముందే పార్టీలో చేరి సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల్లో తన స్వగృహానికి వచ్చి మరి పార్టీలో తీసుకున్నారు. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి కార్పొరేషన్ పందేలు వెనుకబడిపోయారు. మొదటి నుండి కార్పొరేషన్ పదవి వస్తుందని గంపడాక్షతో ఉన్న ప్రతాప్ రెడ్డి ఆయన అభిమానులు ఇప్పుడు కార్పొరేషన్ల ప్రకటనతో నీళ్లు నమ్ముతున్నారు. వస్తుంది అని ఆశపడ్డ వారు ఇంకేం వస్తుంది అంటూ పెదవి విరుస్తున్నారు.

ఇదీ ప్రతాపుడి నేపథ్యం..

షాద్ నగర్ నియోజక వర్గంలో చౌలపల్లి ప్రతాపరెడ్డి పేరు తెలియని వారంటు ఉండరు. ఇతను జూలై 7, 1956న షాద్‌నగర్ మండలం దూసకల్ గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. బి.కాం. వరకు విద్యనభ్యసించాడు. 1994లో రాజకీయాలలో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.1995 స్థానిక సంస్థల ఎన్నికలలో షాద్‌నగర్ జిల్లా పరిషత్తు ప్రాదేశిక నియోజకవర్గం నుంచి జెడ్పిటిసిగా ఎన్నికయ్యాడు. 2002 నుండి 2004 వరకు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాడు. 2009 శాసనసభ ఎన్నికలలో షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి 9838 ఓట్ల మెజారిటీతో ఎమ్మేల్యేగా ఎన్నికయ్యాడు. ప్రతాప్ రెడ్డి 2014, 2018 శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో 2019 మార్చి 22న చేరాడు. ఆ తర్వాత రాజకీయ సమీకరణలో భాగంగా గత ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి చెరువుతో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని సొంత గూటికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ గెలుపు కోసం కాళ్లకు బలపం కట్టుకుని తిరిగారు. ఆయన వేలాదిమంది అనుచరులతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వాస్తవానికి చెప్పాలంటే ప్రతాప్ రెడ్డి రాతతో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గంలో కురువైభవం సంతరించుకుంది. టిఆర్ఎస్ జెడ్పిటిసిలు విశాల, వెంకటరామిరెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్యాంసుందర్ రెడ్డి ఇంకా ఎందరో బీఆర్ఎస్ శ్రేణులు వేలాదిగా ఆయన వెంట నడిచాయి. కొంతమంది బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయ వ్యూహాల కారణంగా కాంగ్రెస్ పార్టీకి లోలోపల మద్దతు పలికారు. దీంతో గండం కట్టేక్కి శంకర్ స్వల్ప మెజార్టీతో బయటపడ్డారు. షాద్ నగర్ శాసన సభ ఎన్నికల్లో కీలకపాత్ర వహించిన ప్రతాప్ రెడ్డికి కార్పొరేషన్ పదవి వస్తుందని అదిగో ఇదిగో అంటూ కార్యకర్తలు ఆశలు పెట్టుకుని ఇప్పుడు ఏకంగా 37 మంది కార్పొరేషన్ చైర్మన్ ప్రకటించిన తర్వాత అందులో ఆయన పేరు ప్రస్తావన రాకపోవడంతో ఆయన అభిమానులు కుంగి కృశించి పోతున్నారు. కార్పొరేషన్ పదవుల వ్యవహారంలోకి వెళ్తే ..సూర్యాపేట నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించి చివరి నిమిషంలో అవకాశాన్ని కోల్పోయిన పటేల్ రమేశ్‌రెడ్డికి నామినేటెడ్ పోస్టు వరించింది. రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ చైర్మన్‌గా మల్‌రెడ్డి రాంరెడ్డి, టూరిజం డెవల్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పటేల్ రమేశ్ రెడ్డి, ఇండస్ట్రీయల్ ఇన్‌ఫ్ట్రాస్ట్రక్చర్ చైర్మన్‌గా నిర్మలా జగ్గారెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్‌గా నేరెళ్ల శారద, వైశ్య కార్పొరేషన్ చైర్మన్‌‌గా కాల్వ సుజాత, ఎస్‌సీ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎన్. ప్రీతమ్ సహా మొత్తం 37 మందికి అవకాశం కల్పించారు. కింది లిస్ట్‌లో మొత్తం వివరాలు పేర్కొనడం జరిగింది. ఇందులో ఎక్కడ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి పేరు ప్రస్తావనకు రాలేదు.. కేపి

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *