మహబూబ్ నగర్ ఆశలు నిజం చేయడమే
నా ఆశయం!
పేరు పేరునా అందరికీ నమస్కారాలతో.. వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా..!
హస్తం గుర్తుపై ఓటు వేయండి.. మహబూబ్ నగర్ అభివృద్ది కోసం నన్ను గెలిపించండి!
మీ చల్లా వంశీచంద్ రెడ్డి మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి
ప్రజా గొంతుక:రంగా రెడ్డి జిల్లా బ్యూరో
నిత్యం ఊర్లలో ఉంటూ మహబూబ్ నగర్ గోడు వింటూ జనంతో మమేకమవుతున్న నాకు స్ఫూర్తినిచ్చిన ఘటనను మీతో పంచుకోవాలి అనుకుంటున్నా!
పాలమూరు న్యాయయాత్రలో, మక్తల్ ప్రాంతంలో ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు ఓ దివ్యాంగ సోదరుడు నాకు ఓ మాట చెప్పాడు. “అన్నా.. ఇన్నాళ్లకు పాలమూరు బతుకులు మారతాయనే నమ్మకం మాకు కలిగింది. మన రేవంతన్న ముఖ్యమంత్రి అయ్యాక మన ప్రాంతానికి చేస్తున్న మంచి చూశాక.. ఆశలు నిజం అవుతాయని అనిపిస్తోంది. మీరు మాకు అండగా ఉండాలన్నా, మన గొంతుక ఢిల్లీలో వినపడాలన్నా” అని ఉద్వేగంతో చెప్పాడు. ఇప్పటికైనా బతుకు మారాలన్నది మహబూబ్ నగర్ ప్రాంతవాసుల ఆశ!
మార్పు రావాలి, మంచి జరగాలి అని కోరుకోవడం ఆశ. జనం కోరుతున్న అదే మార్పును చేతల్లో చూపించడమే ఆశయం. మహబూబ్ నగర్ ఆశను తన ఆశయంగా స్వీకరించింది కాంగ్రెస్ పార్టీ !
ఆశ నుంచి.. ఆశయం వైపు..
ఉద్యమం పేరుతో వలస వచ్చిన నాయకుల్ని ఆదరించిన మహబూబ్ నగర్ మట్టికి నయవంచన ఎదురైంది. పదేండ్లు ఢిల్లీలో పెత్తనం చేసినోళ్లు మన వైపు కన్నెత్తి కూడా చూడకపాయె ! ఇన్నేళ్లకు.. కన్నీళ్లు తుడిచే చేయి భరోసా మనకు దొరికింది.
అధికారంలోకి రాగానే 32 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చింది మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం. ఆడ బిడ్డల పేర ఇండ్లు కట్టేందుకు పునాది పడుతున్నది. ఎక్కడాలేని విధంగా అతి తక్కువ ధరకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందంటే.. అదంతా చేతి చలవే ! అందరికీ రైతు భరోసా, త్వరలోనే రెండు లక్షల రైతు రుణమాఫీ రాబోతున్నది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు, 4 వేల రూపాయల పింఛను అందించబోతున్నది మన ప్రజా ప్రభుత్వం. 63 లక్షల మందికి 5 లక్షల చొప్పున బీమా. మహిళా స్వయం సహాయక సంఘాలకు కోటి రూపాయల దాకా రుణం లాంటి అమూల్యమైన పథకాలను అందిస్తున్నది మన కాంగ్రెస్ ప్రభుత్వం. కేంద్రంలో అధికారంలోకి రాగానే పేద మహిళల ఖాతాల్లో ఏడాదికి లక్ష రూపాయలు డిపాజిట్ చేస్తామని, అర్హులైన యువతకు ఏడాదికి కనీసం లక్ష రూపాయల ఆదాయం ఉండే ఉపాధికి భరోసా ఇస్తున్న ఏకైక పార్టీ కూడా మన కాంగ్రెస్సే !
మహబూబ్ నగర్ జల రాత మారుద్దాం!
మహబూబ్నగర్కు తొలి వంద రోజుల్లోనే వందనాలు అర్పించింది కాంగ్రెస్ పాలన. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతలకు శ్రీకారం, పాలమూరు రంగారెడ్డి నిర్మించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిది ! మెడికల్ – ఇంజనీరింగ్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం, ఉన్నత విద్యా సంస్థలు తెచ్చి.. మహబూబ్నగర్లో ప్రతి పేద బిడ్డకు చదువు, ఉపాధి, ఉద్యోగం అందేలా చేయాలన్నది మన ప్రజా ప్రభుత్వ సంకల్పం, సంక్షేమ వసతులు కల్పించి మహబూబ్నగర్ ప్రాంతంలోని మహిళా సంఘాల సభ్యులను లక్షాధికారులుగా తీర్చిదిద్దే బాధ్యత నాది, మన కాంగ్రెస్ ప్రభుత్వానిది! మహబూబ్నగర్ తరతరాల ఆశలే కాంగ్రెస్ ఆశయాలై.. జలాశయాలై కళ్ల ముందుకు వస్తున్నవి.
ఆశయ సాధన కోసం నేను కట్టుబడి ఉంటా!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,నాయకత్వంతో మనకు అందివచ్చిన జీవితకాల అవకాశాన్ని రెండు చేతులతో అందుకుందాం ! ప్రత్యేక ప్రణాళికతో మన మహబూబ్ నగర్ అభివృద్ధి తీరాలకు చేరుద్దాం!