ఆరోపణలు ఖండిస్తున్నాం
మాజీ సర్పంచ్ మేకల కవిత రాజు
ప్రజా గొంతుక/ బచ్చన్నపేట మండలం
జనగామ నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత మాజీ ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షులు కొమ్మూరి ప్రతాపరెడ్డి పై కొంతమంది వ్యక్తులు కావాలనే లేనిపోని ఆరోపణలు చేస్తూ, గాంధీభవన్లో కంప్లీట్ చేశారని ఇలాంటి పార్టీ వ్యతిరేక విధానాలు ఖండిస్తున్నామని బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామం మాజీ సర్పంచ్ మేకల కవిత రాజు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనగామ నియోజకవర్గం లో ప్రజలకు అందుబాటులో ఉంటున్న నాయకుడు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అన్నారు. వారిపై కొంతమంది వ్యక్తులు చేస్తున్న ఆరోపణలు ఆ వాస్తవాలు అని ఇలాంటి రాజకీయాలు చేయడం తప్పు అని అన్నారు. ఈ పద్ధతిని మార్చుకోవాలని తెలియజేశారు