అనుముల ప్రాజెక్ట్ పరిది లో పోషణ మాసం కార్యక్రమం
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి// షేక్ షాకిర్// నాగార్జున సాగర్ నియోజక వర్గం// హాలియా
నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం అనుముల ప్రాజెక్టు హాలియ మండలంలోని ఎంపీడీవో ఆఫీస్ మీటింగ్ హాల్ నందు’ పోషణ మాసం’ ప్రోగ్రాం సందర్భంగా సిడిపిఓ ఉదయశ్రీ, అధ్యక్షతన అంగన్వాడీ టీచర్లు గర్భిణీ బాలింతల తల్లులతో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్సిపల్ చైర్మన్ అనుపమ నరేందర్ రెడ్డి, జిల్లా అధికారిని డి డబ్ల్యు ఓ సక్కుబాయి, హాజరు అయ్యారు పోషణ మాసం సందర్భంగా తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవాలని చెప్పడం జరిగింది గర్భిణీ తన ప్రసవ సమయం వరకు 12 నుండి 14 కేజీలు పెరగాలని గవర్నమెంట్ హాస్పిటల్ లోనే డెలివరీలు జరిగేలా ప్రోత్సహించాలని చెప్పడం జరిగింది ఒక గర్భవతి ఖచ్చితంగా నాలుగు హెల్త్ చెకప్స్ చేయించుకోవాలని ప్రతినెల గర్భిణీలు బరువులు అంగన్వాడీ సెంటర్లో చూసుకోవాలి నెలకు ఒక కేజీ నుండి రెండు కేజీల వరకు బరువు పెరగాలని రక్త పరీక్షలు కిషోర్ బాలికలకు నిర్వహించి ఐరన్ లోపం ఉన్న పిల్లలకు ఐ ఎఫ్ ఏ టాబ్లెట్స్ మరియు సమతుల ఆహారం తీసుకోవాలని, వాళ్లు తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు ,పప్పు ధాన్యాలు, ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పిండి పదార్థాలు, క్రొవ్వు పదార్థాలు, పాలు గుడ్డు కచ్చితంగా తీసుకుంటే ఐరన్ లోపం నివారించగలమని చెప్పడం జరిగింది, మీటింగ్ అనంతరం గర్భవతులకు శ్రీమంతాలు, ఆరు నెలల నిండిన పిల్లలకు అన్నప్రాసనలు, అక్షరాభ్యా సాలు చేయడం జరిగింది, తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలగల పదార్థాలను ప్రదర్శించడం జరిగింది , ఫ్రీ స్కూల్ ప్రదర్శన, చేయడం జరిగింది,తదుపరి అందరిచే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది, ఈ కార్యక్రమానికి మండల ఎంపీడీవో సుజాత, ఎమ్మార్వో జయశ్రీ, పి హెచ్ సి డాక్టర్ రామకృష్ణ, ఏ సి డి పి ఓ,సువర్ణ ,డిసి, సతీష్, బీసీ, పవన్, సూపర్వైజర్స్ కే రమాదేవి, ఎస్ సరిత, అంగన్వాడీ టీచర్స్ గర్భవతులు పిల్లలతల్లులు పాల్గొనడం జరిగింది.