హై టెన్క్షన్ లైన్ తో రేడియేషన్ కు అవకాశం.
హై టెన్క్షన్ లైన్ వద్దు గ్రామాలను అభివృద్ధి చేయండి.
తహసీల్దార్ కు వినతి పత్రం అందజేసిన పోమాల్ పల్లి గ్రామస్తులు.
ప్రజా గొంతుక ,రంగారెడ్డి బ్యూరో:
అధిక హై టెన్షన్ విద్యుత్ లైన్ల నుండి విద్యుత్ అధిక మొత్తంలో రేడియేషన్ వచ్చి పిల్లలు,వృద్ధులు,జంతువులకు తీవ్ర ప్రమాదం పొంచి ఉందని కావున,ఏ హై టెన్క్షన్ విధ్యుత్ లైన్ మార్కింగ్ మార్చాలని కోరుతూన్నారు పోమాల్ పల్లి గ్రామస్తులు,యువత,చిన్నారులు.మహేశ్వరం నుంచి జడ్చర్ల వరకు పోమాల్ పల్లి గ్రామం మీదుగా నిర్మిస్తున 765 కె వి ఏ హై టెన్క్షన్ విధ్యుత్ లైన్ మార్కింగ్ మార్చాలని డిమాండ్ చేస్తూ కేశంపేట మండల తాసిల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ,,,ముందుగా మార్కింగ్ ఇచ్చిన విధంగానే విద్యుత్ లైన్ నిర్మాణం చేపటాలని కోరారు.గ్రామ సమీపంలో నుంచి విద్యుత్ లైన్ వస్తే గ్రామం అన్ని రకాలుగా అభివృద్ధికి దూరమవుతుందని అన్నారు.భవిష్యత్తులో ప్రమాదాలు అవకాశాలు ఉన్నాయని గ్రామస్థులు వివరించారు.అత్యంత పురాణతమైన గ్రామ దేవత గుడి పక్క నుండి ప్రమాదకరమైన విద్యుత్ లైన్ ను తమ గ్రామానికి దూరంగా వేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారులదే అని కోరారు.భవిష్యత్తులో రేడియేషన్ ద్వారా అనేక రోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. తాసిల్దార్ ని కలిసి వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ సర్పంచ్ కృష్ణయ్య యాదవ్,డిప్యూటీ సర్పంచ్ అనుమగల్ల రమేష్, సీనియర్ నాయకులు భూపాల్ రెడ్డి,చంద్రారెడ్డి,ముత్యాల రెడ్డి,పూజారి రవి శర్మ,మహేష్,నర్సింలు,మస్తాన్ యాదయ్య దాసరి నర్సింలు,మహేష్,తదితరులు ఉన్నారు.