చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు—-సీపీఎం

చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదు—-
సీపీఎం

(ప్రజా గొంతుక న్యూస్)సెప్టెంబర్ 17 నాగార్జున సాగర్ నియోజక వర్గం ప్రతినిధి ::షేక్ షాకిర్

భూమికోసం భుక్తి కోసం తెలంగాణ విముక్తి కోసం జరిగిన విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రను కొన్ని హిందుత్వ మతతత్వ శక్తులు వక్రీకరించి హిందూ ముస్లిం రాజులకు మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించి, వివిధ రకాల మాధ్యమాల ద్వారా ప్రచారం చేస్తూ ప్రజా సమాజాన్ని ప్రజలనుతప్పుదోవ పట్టిస్తున్నారని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరిస్తే సహించేది లేదని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కొండేటి శ్రీను,సీపీఎం మండలకార్యదర్శి కందుకూరికోటేష్ లు హెచ్చరించారు. మంగళవారం నిడమనూరు లో తెలంగాణ సాయుధ పోరాట అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరవీరుల చిత్రపటాలకు పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం పూర్వం నుండి తెలంగాణ ప్రాంతంలో దొరలు,భూస్వాములు, పెతందారులు, జాగిర్దారులు సామాన్య ప్రజానీకాన్ని అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్న సందర్భంలో భూస్వాముల పెత్తందారుల నుండి , వెట్టి చాకిరికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల పక్షాన కమ్యూనిస్టుల నాయకత్వనా పోరాటం జరిగిందని వారన్నారు. సుమారు నాలుగున్నర సంవత్సరాల పాటు భూమి కోసం బుక్తి కోసం సాగిన పోరాటంలో అనేకమంది అమరవీరులు ప్రాణాలు అర్పించి ఉద్యమానికి ఊపిరి అందించారని, 4000 మంది అమరుల బలిదానంతో భూస్వాముల నుండి స్వాధీనం చేసుకున్న పది లక్షల ఎకరాల భూమిని కమ్యూనిస్టుల నాయకత్వంలో పేదలకు పంపిణీ చేశారని వారు అన్నారు. దున్నేవాడికే భూమి అనే నినాదంతో రజాకార్లకు భూస్వాముల కు వ్యతిరేకంగా గ్రామాలలో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకొని ప్రజలను చైతన్యము చేయడంలో కమ్యూనిస్టుల పాత్ర కీలకమైందని వారు తెలిపారు. నాటి నుండి నేటి వరకు ప్రజల పక్షాన పేదల పక్షాన ప్రజల సమస్యల కొరకు నిరంతరం పోరాడేది కమ్యూనిస్టులు మాత్రమేనని, అటువంటి మహోత్తరమైన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ పోరాట చరిత్రలో గుర్తించబడిందని, అటువంటి చరిత్ర భవిష్యత్తుకు తరాలకు స్ఫూర్తిదాయకమని, మహోత్తరమైన పోరాట చరిత్రను హిందుత్వ మతతత్వ శక్తులు వక్రీకరించి శునకానందం పొందుతున్నాయని,, తెలంగాణ సమాజం అటువంటి వారికి తగిన బుద్ధి చెప్పాలని, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు *కోమండ్ల గురువయ్య, మలికంటి చంద్రశేఖర్, కోదండ చరణ్ రాజు,కుంచెం శేఖర్, వింజమూరు శివ, తోటపల్లి బాల నారాయణ, వింజమూరి పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *