పార్థివ దేహాన్ని సందర్శించి, నివాళులు అర్పించిన.నల్లగొండ జిల్లా ఎమ్మెల్సీ
ప్రజా గొంతుక న్యూస్ ప్రతినిధి నక్కల లింగారెడ్డి అనుముల మండలం
నల్లగొండ జిల్లా:
నాగార్జునసాగర్ నియోజకవర్గం.అనుముల మండలం,ముక్కామల గ్రామంలో గ్రామ వాస్తవ్యులు గోనె శ్రీపతి రావు హఠాత్తుగా గుండె పోటుతో మరణించటం జరిగింది. వారి నివాసంలో వారి పార్ధీవ దేహాన్ని సందర్శించి,పులా మాలలు వేసి నివాళులు అర్పించిన
నల్లగొండ జిల్లా శాసన మండలి సభ్యులు యం.సి కోటిరెడ్డి శ్రీపతి రావు గుండెపోటుతో మరణించటం బాధాకరం అని,వారి మరణం పట్ల వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఎమ్మెల్సీ తో పాటు మాజీ సర్పంచ్ గోనె శ్రీనివాస్ రావు,తాజా మాజీ సర్పంచ్ ముఖ్య సలహాదారుడు గోనె నరేందర్ రావు,గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.