అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ దేవరకొండ
ప్రజా గొంతుక సెప్టెంబర్ 25 డివిజన్ ప్రతినిధి దేవరకొండ జిల్లా నల్గొండ
అఖిలభారత విద్యార్థి పరిషత్
ఆధ్వర్యంలో బుధవారం రోజున దేవరకొండ నగరంలో ఉన్నటువంటి పలు పాఠశాలలో మరియు కళాశాలలో ఏబీవీ tvపీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించి మరియు నూతన కళాశాలల కమిటీలను ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమం లో ఏబీవీపీ నాయకులు యలమల గోపీచంద్ మాట్లాడుతూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 1949 జూలై 9న కేవలం నలుగురు వ్యక్తులతో స్థాపించబడిన సంస్థ ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా నిలిచిందని అలాగే ఏబీవీపీ చేసే కార్యక్రమాల గురించి అలాగే కేరళలో ఏబీవీపీ చేసిన కార్యక్రమాల గురించి మరియు దేవరకొండ లోని జూనియర్ కళాశాల ఆటస్థల ప్రాంగణంలో వెజ్ నాన్ వెజ్ మార్కెట్ యార్డ్ నిర్వహించొద్దని చేసిన కార్యక్రమం మరియు కధనబేరి మార్పు కోసం మహా ఉద్యమం అనే కార్యక్రమాన్ని చేపట్టి గతంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించి విజయం సాధించిందని అన్నారు అదేవిధంగా కరోనా సమయంలో ఏబీవీపీ చేసిన సేవా కార్యక్రమాల గురించి అదే సమయంలో చేపట్టిన కోటివృక్ష అభియాన్ అనే కార్యక్రమం గురించి మరియు ఏబీవీపీ దేశం కోసం పనిచేసే విధానాన్ని క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. మరియు సత్యసాయి జూనియర్ కళాశాల నూతన కమిటీ అధ్యక్షునిగా నేనావత్ సింహాద్రి , కార్యదర్శిగా జై. భార్గవి మరియు భవిత జూనియర్ కళాశాల నూతన కమిటీ అధ్యక్షునిగా ఆర్. అనిల్ సెక్రటరీగా ఎన్. వైష్ణవి మరియు జరీన్ పారామెడికల్ నూతన కళాశాల కమిటీ అధ్యక్షునిగా ఎం
పరమేష్ కార్యదర్శిగా ఎం. పావని తదితర కార్య వర్గాన్ని ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఆసిఫ్, గణేష్, సంతోష్, వికాస్ తదితరులు పాల్గొన్నారు.