రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన, ఫ్వార్వార్డ్ చేసిన జైలుకే

రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టిన, ఫ్వార్వార్డ్ చేసిన జైలుకే

పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్.,

ప్రజా గొంతుక పెద్దపెల్లి ప్రతినిధి : ఇరుకుల్ల వీరేశంసామాజిక మాధ్యమాల్లో చట్టవ్యతిరేక పోస్టులు పెట్టేవారిపై ప్రత్యేక నిఘా ఉంటుంది. వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని కేసులు నమోదు చేసి పిడి యాక్ట్ అమలు చేసి జైలుకు పంపిస్తామని పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ ఐపిఎస్., (ఐజి) ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ.. రామగుండము పోలీస్ కమీషనరేట్ లో కొంతమంది ట్విటర్‌, ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, యూట్యూబ్, ఇతర సోషల్‌ మీడియాలను వేదికగా కొందరు వివిధ రాజకీయ నేతలను టార్గెట్‌గా చేసుకుని కొందరు, దేవుళ్ళకు సంబంధించి కొందరు, ఓ మతాన్ని లేదా మతానికి సంబంధించిన ప్రముఖుల్ని టార్గెట్‌గా చేసుకుని మరికొందరు పోస్టులు పెడుతున్నారు. కొంతమంది వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రూపులలో ప్రజలను ధర్నాలు, రాస్తారోకోలు, గొడవలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే విధంగా గుమ్మికుడి వర్గ పోరును రెచ్చగొట్టే విధంగా సందేశాలు పంపడం వంటి చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఓ వర్గాన్ని, వ్యక్తులను కించపరుస్తూ పోస్ట్‌ చేసినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే రీతిలో పుకార్లు ప్రచారం చేసినా జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. అలాంటి వారికి జైలు శిక్ష, జరిమానాతోపాటు కేసు తీవ్రతను బట్టి జీవిత ఖైదు పడే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు. అదేవిధంగా.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేముందు, వచ్చిన పోస్టులను ఫార్వర్డ్‌ చేసేముందు అవి నిజమా కాదా అని ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా మత ఘర్షణల కలిగేలాగా, లా అండ్ ఆర్డర్ సమస్యలు సృష్టించే వారిపై, మతాలను, కులాలను, ఒకరినొకరు కించపరుస్తూ గాని , లేనిపోని అబద్దపు పుకార్లను సృష్టించె వారిపై 24×7 నిరంతరం రామగుండము పోలీస్ కమీషనరేట్ లో సోషల్ మీడియా ట్రాకింగ్ సెంటర్ “SOCIAL MEDIA TRACKING CENTRE” (SMTC) ద్వారా సోషల్‌ మీడియా పోస్ట్ లపై సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ నిఘా ఉంటుంది. కొందరు ఐపీ అడ్రస్ లు మార్చి ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది వారి వ్యక్తిగత సోషల్ మీడియా ప్రొఫైల్ డిపిలుగా చట్ట విరుద్ధంగా మారణాయుధాలతో కూడిన ఫోటోలను పెట్టుకోవడం జరుగుతుందని వాటిని వెంటనే తొలగించాలని అని సిపి హెచ్చరించారు.

0Shares

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *