గ్రామ పంచాయతీ సిబ్బందికి
దుస్తులు పంపిణీ చేసిన
అల్లం సతీష్…
ఘనంగా వెంకటస్వామి జయంతి వేడుకలు.
ప్రజా గొంతుక ఓదెల ప్రతినిధి :
ఓదెల మండలంలోని ఓదెల,కొలనూర్ గ్రామాల తోపాటు పలు గ్రామాలలో కాక వెంకట స్వామి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించినారు ఈ సందర్భంగా ఓదెలలో మాజీ కేంద్ర మంత్రివర్యులు , బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ గడ్డం వెంకటస్వామి (కాకా) 95వ జయంతి సందర్భంగా గ్రామ పంచాయతీ సిబ్బందికి మాజీ వార్డ్ సభ్యులు అల్లం సతీష్ దుస్తులను అందజేసినారు అలాగే కొలనూర్ గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రిలో కాక వెంకట స్వామి జయంతి పురస్కరించుకొని వారి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు , పెద్దపల్లి మార్కెట్ కమిటీ మాజి చైర్మన్ గుండేటి ఐలయ్య యాదవ్
ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాకా వెంకట స్వామి కీలక పాత్ర అని వారు బతికున్నంత కాలం పేదల ప్రజల కోసం పరితపించేవారని పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో అనుక్షణం ప్రజల బాగోగులు చూసుకుంటూ ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవారని అన్నారు రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగి ఎందరికో ఆదర్శంగా నిలిచారని , వారి కుటుంబం కూడా వారి అడుగుజాడల్లో నడుస్తూ అనునిత్యం పెద్దపెల్లి పార్లమెంట్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీ ముందుచూపుతో ఈ ప్రాంత అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఆకుల మహేందర్ ఢిల్లీ శంకర్ , కుంచెం మల్లయ్య నాయకులు గోపతి సదానందం గడి గొప్పల సంతోష్ వివిధ సంఘాల అధ్యక్షులు గోపతి ఎల్లయ్య కొండ్ర లక్ష్మణ్ రాపల్లి రాజయ్య గాజుల శివశంకర్ , బండారి కుమార్ రాచర్ల రాకేష్ అప్పని తిరుపతి రాచర్ల ఓదెలు రాచర్ల రాకేష్ బొంగాని రాజయ్య , జంగం కొమురయ్య , మేకల సమ్మయ్య , గడ్డం రాజ్ కుమార్ , కర్క లక్ష్మారెడ్డి , బండారి చంద్రయ్య , సిరిశెట్టి ఓదెలు , కర్కమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.